292 మంది ఖైదీల విడుదలకు షేక్ మొహమ్మద్ ఆదేశం
- November 30, 2016
దుబాయ్ రూలర్, యూఏఈ వైఎస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 292 మంది ఖైదీల విడుదలకు ఆదేశించారు. యూఏఈ 45వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఐసా అల్ హుమైదాన్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ దుబాయ్ పోలీస్తో ఈ విషయమై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. షేక్ మొహమ్మద్ క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, ఖైదీలుగా ఇప్పటిదాకా జీవితం గడిపినవారు, క్షమాభిక్ష తర్వాత సమాజంలోకి వచ్చి మంచి పౌరులుగా జీవించాలనీ, దేశాభివృద్ధిలో కలిసి పనిచేయాలని అల్ హుమైదాన్ కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







