హైదరాబాదీ శాఫ్రాన్ చికెన్
- December 01, 2016
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ - అర కిలో, గోరు వెచ్చని పాలు - అర కప్పు, తాజా క్రీమ్ - 50 గ్రా, శొంఠి పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - 3 చిటికెళ్లు, పచ్చిమిర్చి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 150 మి.లీ, నెయ్యి - 100 గ్రా, మేవా - 100 గ్రా, జీడిపప్పు పేస్ట్ - 100 గ్రా, బిరియాని ఆకు - 2, దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క, యాలకులు - 2, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు.
తయారీ విధానం: పాలలో కుంకుమ పువ్వ వేసి నానబెట్టాలి గిన్నెలో నూనె వేడి చేసి యాలకులు, బిరియాని ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, శొంఠి పొడి వేసి కలిపి తర్వాత పాలు, మేవా, జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఈ దినుసులన్నీ వేగి మగ్గాక చికెన్, ఉప్పు, కుంకుమ పాలు పోయాలి. కూర ఉడకటం మొదలయ్యాక మంట తగ్గించి చికెన్ ముక్కలు ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి. దీన్లో క్రీమ్, నెయ్యి కలపాలి. కూర చిక్కబడ్డాక మంట తీసి వేడిగా వడ్డించాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









