ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా 'రోబో 2.0'
- December 02, 2016
గ్రేట్ డైరెక్టర్ శంకర్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 2.0. శంకర్, రజనీల కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా రోబోకు సీక్వల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని మించి భారీ గ్రాఫిక్స్ తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 350 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని ప్రకటించారు. కానీ.., సినిమా నిర్మాణంలో బడ్జెట్ పెరిగిపోవటంతో ప్రస్తుతం 2.0 సినిమా బడ్జెట్ 400 కోట్లకు చేరిందట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఆసియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా మారిపోయింది.
భారీ బడ్జెట్ కావటంతో రిలీజ్ విషయంలో కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తమిళ్ తో పాటు, తెలుగు హిందీ భాషల్లో కూడా వేల థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టిన రోబో టీం ఇతర దేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న మలేషియా, థాయ్ లాండ్ లాంటి దేశాలతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాల్లో కూడా రెండు మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న 2.0 కమర్షియల్ గా ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







