నేషనల్‌ డే సందర్భంగా యూనియన్‌ హౌస్‌లో యూఏఈ నాయకుల సమావేశం

- December 03, 2016 , by Maagulf
నేషనల్‌ డే సందర్భంగా యూనియన్‌ హౌస్‌లో యూఏఈ నాయకుల సమావేశం

దుబాయ్‌: యూఏఈ లీడర్‌ షిప్‌ - సీనియర్‌ సభ్యులు యూనియన్‌ హౌస్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు సందేశాన్నివ్వడానికి, తద్వారా దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, క్రౌన్స్‌ & రపిన్స్‌, డిప్యూటీ సూపర్‌ కమాండర్‌ - యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌, మెంబర్స్‌ ఆఫ్‌ ఫెడరల్‌ సుప్రీం కౌన్సిల్‌, ఎమిరేట్స్‌ రూలర్స్‌తో కలిసి సమావేశమయ్యారు. 45వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ మ్యూజియంను ప్రారంభించారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మంచి అభివృద్ధి సాధిస్తోందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com