సైబర్ ఎటాక్స్‌పై నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ మానిటరింగ్
- December 03, 2016
జెడ్డా: నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, పలు ప్రభుత్వ ఏజెన్సీలు మరియు, సంస్థలపై జరుగుతున్న సైబర్ ఎటాక్స్‌పై దృష్టిపెట్టింది. దీనికి సంబంధించి రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. హ్యాకర్లు అక్రమంగా పలు సంస్థల వెబ్‌సైట్లలోకి చొరబడటం లేదా మాల్‌వేర్‌ని జొప్పించడం ద్వారా విలువైన డేటాను తస్కరిస్తుంటారు. పనిగట్టుకుని జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలపై ఫోకస్ పెట్టి, కొన్ని సంస్థల్ని కూడా గుర్తించిన నేషనల్ సెంటర్, ఆయా సంస్థలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో వైపున కింగ్‌డమ్ బయటినుంచి కొన్ని దాడులు జరుగుతున్నాయనీ, ఆ కారణంగా ప్రభుత్వ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ సూచించింది. తమ డేటాను సేఫ్‌గార్డ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అనుమానాస్పదంగా వచ్చే మెయిల్స్‌ని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయరాదనీ, అలాగే ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే డేటా భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుని, సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలని నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







