సౌదీ అరేబియా, టర్కీ మధ్య 8 ఒప్పందాలు
- December 03, 2016
రియాద్: సౌదీ అరేబియా, టర్కీ మధ్య 8 ఒప్పందాలు ఇస్తాంబుల్‌లో జరిగాయి. కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ మినిస్టర్ మాజిద్ అల్ కస్సాబి, అలాగే టర్కిష్ ఎకానమీ మినిస్టర్ నిహాద్ జబ్కా మధ్య ఈ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాల మధ్యా వాణిజ్యాన్ని మరింత వృధ్ధి చేసేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడనున్నాయి. సౌదీ కంపెనీలు ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో పెట్టుబడులు పెడుతున్నాయి. టర్కీకి చెందిన ప్రైవేటు మరి, పబ్లిక్ సెక్టార్స్‌తో కలిసి టర్కీలో ఈ ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. అగ్రికల్చర్, ఫైనాన్స్, టూరిజం మరియు మ్యూనికేషన్ సెక్టార్స్‌లో కూడా కలిసి ఇంకా ఉధృతంగా పనిచేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. ఇంకో వైపున టర్కీ టెక్నాలజీ విభాగంలో ముందుంది. అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లు టర్కీలో ఎక్కువ. అలాగే టూరిజం రంగంలో టర్కీ అత్యద్భుతంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో టర్కీ - సౌదీ అరేబియా కలిసి పనిచేయడం ద్వారా ఆయా రంగాల్లో సమైక్యంగా అభివృద్ధి సాధించడానికి అవకాశాలున్నాయని ఇరు దేశాల ప్రతినిథులు ఒప్పందాల సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







