బంగ్లాదేశ్‌లో రోజురోజుకీ పెరుగుతున్నదాడులు

- December 04, 2016 , by Maagulf
బంగ్లాదేశ్‌లో రోజురోజుకీ పెరుగుతున్నదాడులు

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుండగులు ఈరోజు మరో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందులోని మూడు విగ్రహాలను ముక్కలు చేశారు. తూర్పు నెట్రొకోన ప్రాంతంలోని మైమెన్‌సింఘొరోహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం పది హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. షరీఫ్‌పూర్ కాళీ ఆలయం తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసిన గ్రామస్తులకు లోపల ధ్వంసమైన విగ్రహాలు కనిపించాయి. ముక్కలైన విగ్రహాల్లో ఒకటి కాళీమాత విగ్రహం కాగా మరొకటి శివుని విగ్రహం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com