టూరిజం డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ

- December 06, 2016 , by Maagulf
టూరిజం డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ

మనామా: జాతీయ ఎకానమీలో టూరిజం పాత్ర చాలా ఎక్కువ అనే అంచనాల నేపథ్యంలో, నిన్న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మరింతగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కింగ్‌డమ్‌లో టూరిస్ట్‌ రిసార్ట్స్‌తోపాటు, టూరిజం సౌకర్యాల్ని పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, ఈ మేరకు పలు సూచనలు కూడా చేశారు. టూరిజం సెక్టార్‌కి నష్టం కల్గించే చర్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రిన్స్‌ ఖలీఫా సూచించారు. మినిస్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, కామర్స్‌ అండ్‌ టూరిజం, ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌ ప్రవేశపెట్టిన మెమరాండమ్‌ని క్యాబినెట్‌ సమావేశంలో పరిగణనలోకి తీసుకున్నారు. కార్‌ రెంటల్‌ యాక్టివిటీస్‌ని బహ్రెయినీలకు లిమిట్‌ చేయడం ద్వారా ఈ సెక్టార్‌లో విదేశీయులకు ఓనర్‌షిప్‌ని తగ్గించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com