గార్లిక్ పొటాటో వెడ్జెస్

- September 02, 2015 , by Maagulf
గార్లిక్ పొటాటో వెడ్జెస్

 

ఆలూ తో చేసే వంటలు ఇష్టపడని పిల్లలు ఉండరు కదండి..మరి అలాంటి నోరూరించే వంటకం చూద్దామా? అదే 'గార్లిక్ పొటాటో వెడ్జెస్'..!!

 

కావలసిన పదార్ధాలు:

  • ఆలూ - 4
  • ఆలివ్ ఆయిల్ - 4 టీ స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • నల్ల మిరియాల పొడి - 1/4 టీ స్పూను
  • ఎండు మిర్చి పొడి - 1 టీ స్పూను
  • కొత్తిమీర - 2 టీ స్పూన్లు (సన్నగా తరిగిన)
  • వెల్లుల్లి పొడి - 1 టీ స్పూను (వెల్లుల్లి పొడి దొరకకపోతే సన్నగా తరిగిన వెల్లుల్లి వాడచ్చు)

 

తయారుచేయు విధానం:

  • ముందుగా ఓవెన్ ను 150 డిగ్రీల వేడిలో పెట్టాలి.
  • ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో నూనె పీల్చే పేపర్ పరచండి.
  • ఆలూ గడ్డలను బాగా కడిగి, పెచ్చు తీసి పెట్టుకోవాలి. వీటికి ఒక టవల్ తో బాగా తుడిచి పెట్టుకోండి.
  • ఇప్పుడు ఈ ఆలూ గడ్డలను వెడ్జెస్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోండి.
  • ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని పదార్ధాలు ఆలూ గడ్డాల మీద వేసి బాగా కలపండి.
  • ఈ ముక్కలను బేకింగ్ ట్రే లో వేసి ఒక 15 - 20 నిమిషాలు బేక్ చేయండి.
  • ఇప్పుడు ఓవెన్ నుంచి ట్రే తీసి ముక్కలను మరో వైపు తిప్పి మరో 10 - 20 నిమిషాలు బేక్ చేయండి. ఇప్పుడు అవి బంగారు రంగులోకి మరియు కరకర మనేట్టు అవుతాయి.
  • ఓవెన్ నుండి తీసేసి టమాటో కెచప్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com