గార్లిక్ పొటాటో వెడ్జెస్
- September 02, 2015
ఆలూ తో చేసే వంటలు ఇష్టపడని పిల్లలు ఉండరు కదండి..మరి అలాంటి నోరూరించే వంటకం చూద్దామా? అదే 'గార్లిక్ పొటాటో వెడ్జెస్'..!!
కావలసిన పదార్ధాలు:
- ఆలూ - 4
- ఆలివ్ ఆయిల్ - 4 టీ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- నల్ల మిరియాల పొడి - 1/4 టీ స్పూను
- ఎండు మిర్చి పొడి - 1 టీ స్పూను
- కొత్తిమీర - 2 టీ స్పూన్లు (సన్నగా తరిగిన)
- వెల్లుల్లి పొడి - 1 టీ స్పూను (వెల్లుల్లి పొడి దొరకకపోతే సన్నగా తరిగిన వెల్లుల్లి వాడచ్చు)
తయారుచేయు విధానం:
- ముందుగా ఓవెన్ ను 150 డిగ్రీల వేడిలో పెట్టాలి.
- ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో నూనె పీల్చే పేపర్ పరచండి.
- ఆలూ గడ్డలను బాగా కడిగి, పెచ్చు తీసి పెట్టుకోవాలి. వీటికి ఒక టవల్ తో బాగా తుడిచి పెట్టుకోండి.
- ఇప్పుడు ఈ ఆలూ గడ్డలను వెడ్జెస్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోండి.
- ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని పదార్ధాలు ఆలూ గడ్డాల మీద వేసి బాగా కలపండి.
- ఈ ముక్కలను బేకింగ్ ట్రే లో వేసి ఒక 15 - 20 నిమిషాలు బేక్ చేయండి.
- ఇప్పుడు ఓవెన్ నుంచి ట్రే తీసి ముక్కలను మరో వైపు తిప్పి మరో 10 - 20 నిమిషాలు బేక్ చేయండి. ఇప్పుడు అవి బంగారు రంగులోకి మరియు కరకర మనేట్టు అవుతాయి.
- ఓవెన్ నుండి తీసేసి టమాటో కెచప్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







