సెల్వరాజ్ ఇంటికి చేరుకున్నాడు...
- December 06, 2016
పనికోసం దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి తిరిగి రాలేక నరకయాతన అనుభవించిన తమిళనాడుకు చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దుబాయ్ నుంచి వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక టికెట్ కొనివ్వండంటూ సెల్వరాజ్ అక్కడి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం 22 కి.మీ. దూరం నడిచి కోర్టుకు హాజరయ్యేవాడు. అలా అతడు సంవత్సర కాలంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు నడిచాడు. విదేశంలో పలు కష్టాలు అనుభవిస్తున్న సెల్వరాజ్ గురించి ఓ సామాజిక కార్యకర్త కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తెచ్చారు.
ఆమె దుబాయ్‌లో ఉన్న భారత దౌత్య అధికారులతో మాట్లాడి సెల్వరాజ్‌ను భారత్ తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అలా ఎట్టకేలకు కేంద్ర మంత్రి సహాయం ద్వారా సెల్వరాజ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నందుకు కుటుంబసభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. విదేశాల్లో చిక్కుకొని ఉన్న భారతీయుడిని రక్షించి మరోసారి మంత్రి సుష్మ తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









