ఇకపై ఆర్మీ అధికారిక వాహనంగా టాటా సఫారీ స్ట్రామ్
- December 06, 2016
ఆర్మీ వాహనమంటే మనకు మారుతి జిప్సీ గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు ఆర్మీ తన వాహనాలను మార్చాలని నిర్ణయించింది. మారుతి జిప్సీ స్థానంలో టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టాటా మోటార్స్ సంస్థకు 3198 వాహనాల ఆర్డర్లను ఆర్మీ ఇచ్చినట్లు తెలిసింది. ఎంతో కాలంగా ఆర్మీ వాహనంగా మారుతి జిప్సీని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల స్థానంలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఉండే ఎస్యూవీ వాహనాలను తీసుకురావాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. మహీంద్ర కంపెనీ నుంచి పోటీ ఎదురైనప్పటికీ టాటా మోటార్స్ ఈ డీల్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.
వాహనాల మార్పుపై భారత సైన్యం అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద 30 వేలకుపైగా జిప్సీ వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్‌తో నడిచే వాహనాలు. వీటి స్థానంలో తీసుకువచ్చే టాటా సఫారీ స్ట్రామ్ వాహనాలు డీజిల్‌తో నడుస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







