హ్యూమన్ ఆర్గాన్: అబుదాబీ స్కూల్ రికార్డ్
- December 06, 2016
గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ని తిరగరాశారు జెమ్స్ కేంబ్రిడ్జ్ స్కూల్ - అబుదాబీ విద్యార్థులు. 3196 మంది విద్యార్థులు కలిసి, ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ ఆర్గాన్ ఇమేజ్‌ని రూపొందించారు. గతంలో ఇలాంటి రికార్డ్ బీజింగ్‌లో 1500 మంది వాలంటీర్జ్తో రూపొందింది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) పట్ల అవేర్నెస్ పెంచే క్రమంలో ఈ ఇమేజ్‌ని తయారుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్ల మంది సిఓపిడి సమస్యతో బాధపడుతున్నారు. రానున్న పదేళ్ళలో 30 శాతానికి పైగా ఈ సమస్య కారణంగా మరణాలు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. జెమ్స్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిఇఓ మరియు ప్రిన్సిపల్ కెల్విన్ హార్న్స్బై మాట్లాడుతూ, తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదువుతోపాటు వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామనీ, ఈ రికార్డ్ తమ విద్యార్థులు సాధించడం గర్వకారణంగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







