హ్యూమన్‌ ఆర్గాన్‌: అబుదాబీ స్కూల్‌ రికార్డ్‌

- December 06, 2016 , by Maagulf
హ్యూమన్‌ ఆర్గాన్‌: అబుదాబీ స్కూల్‌ రికార్డ్‌

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ని తిరగరాశారు జెమ్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ - అబుదాబీ విద్యార్థులు. 3196 మంది విద్యార్థులు కలిసి, ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్‌ ఆర్గాన్‌ ఇమేజ్‌ని రూపొందించారు. గతంలో ఇలాంటి రికార్డ్‌ బీజింగ్‌లో 1500 మంది వాలంటీర్జ్‌తో రూపొందింది. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సిఓపిడి) పట్ల అవేర్‌నెస్‌ పెంచే క్రమంలో ఈ ఇమేజ్‌ని తయారుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్ల మంది సిఓపిడి సమస్యతో బాధపడుతున్నారు. రానున్న పదేళ్ళలో 30 శాతానికి పైగా ఈ సమస్య కారణంగా మరణాలు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. జెమ్స్‌ కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సిఇఓ మరియు ప్రిన్సిపల్‌ కెల్విన్‌ హార్న్‌స్‌బై మాట్లాడుతూ, తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదువుతోపాటు వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామనీ, ఈ రికార్డ్‌ తమ విద్యార్థులు సాధించడం గర్వకారణంగా ఉందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com