రుణభారంతో ఒంగిన 'అట్లాస్' - ఆస్తుల విక్రయానికై నిర్ణయం

- September 03, 2015 , by Maagulf
రుణభారంతో ఒంగిన 'అట్లాస్' - ఆస్తుల విక్రయానికై నిర్ణయం

500 మిలియన్ దినారాల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అట్లాస్ జువెల్లరీ, రుణాలను తిరిగి చెల్లించడానికి, GCC దేశాలన్నిటా ఉన్న తమ అన్ని ఆస్తులను విక్రయించ పూనుకుంది. దుబాయి లోని యునైటెడ్ నేషనల్ బాంకు ఆవరణలో అతిరహస్యంగా ఏర్పాటుచేయబడిన సమావేశంలో, సంస్థ యజమాని భార్య ఐన శ్రీమతి ఇందిరా రామచంద్రన్, తమకు రుణాలిచ్చిన 20 బాంకుల వారితో వివిధ రకాల రుణచెల్లింపు అవకాశాలను గురించి ఈ బుధవారం చర్చించారు. GCC లో 35, యూ. ఏ. ఈ. లో 19 ఆభరణాల దుఖానాలను, రెండు ఆసుపత్రులను కలిగియున్న గ్రూపు అధినేత ఎమ్.ఎమ్. రామచంద్రన్ కు బెయిలు లభించని కారణంగా ఆయన తరపున సంస్థ కమ్యునికేషన్స్ హెడ్ - శ్రీ శ్యాం మోహన్ మాట్లాడుతూ, తమ సంస్థ ప్రతి ఒక్క రుణాన్ని పూర్తిగా తీర్చడానికే కట్టుబడిందని, అందుకై ఆస్తుల విక్రయ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ విధమైన ఎత్తుపల్లాలు సాధారణమని, చిరకాలం నుండి కాలపరీక్ష కు నిలబడి నిలిచిన సంస్థ ఆర్ధిక మూలాలు ఈ సమస్యలను తరిమి కొట్ట గలిగినంత సుస్థిరమైనవని ధీమా వ్యక్తం చేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com