మస్కట్ ఎయిర్ పోర్ట్ రన్ వే పనుల వల్ల ముందే కూసే కోయిలలకు ఆలస్యం

- September 03, 2015 , by Maagulf
మస్కట్ ఎయిర్ పోర్ట్ రన్ వే పనుల వల్ల ముందే కూసే కోయిలలకు ఆలస్యం

ఒమాన్ దేశ రాజధాని మస్కట్కు వేకువ ఝామునే రాకపోకలు సాగించే ప్రయాణీకులకు, నిర్వహణ పనుల నిమిత్తం, రన్వే ను మూసివేయమని అప్పుడప్పుడు అధికారులు ఇచ్చే ఆజ్ఞల వలన వారానికి 3 సార్లు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం, ఒమాన్ ఏర్ పోర్ట్స్ మానేజ్ మెంట్ కంపెనీ వారు ఆది, సోమ, మరయు బుధవారాల్లో ఉదయం 5 30 నుండి 6 30 వరకు రన్ వే ను మూసివేయటం వల్ల, ప్రయాణీకులకు, ఏర్ లైన్స్ వారికి కూడా వివిధ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమౌతోంది. (OAMC)  ఈ విషయమై OAMC టెక్నికల్ సర్వీసెస్ జనరల్ మానేజర్ సేయిడ్ క్ అల్ జద్ జల్లి మాట్లాడుతూ, ఇది 'నోటిస్ టు ఏర్ మన్' ద్వారా జరిగే సాధారణ ప్రక్రియ అని, సమయనుసారంగా విమానాశ్రయ నిర్వహణ ప్రపంచమంతటా విమానాశ్రయాలలో జరిగే అతి ముఖ్య ప్రక్రియ అని, ఇది త్వరలోనే ముగియనున్నదనీ ఆయా హామీ ఇచ్చారు. ఈ విషయమై తమకు సహకరిస్తున్న ప్రయాణీకుల్ౌ, ఏర్ లైన్స్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com