`చిన్నారి`... ఈ నెల 16న విడుదల!
- December 08, 2016కన్నడలో విజయవంతమైన `చిన్నారి`...తెలుగులో ఈ నెల 16న విడుదల!
ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన చిత్రం కన్నడ చిత్రం `మమ్మీ`. తెలుగులో `చిన్నారి` పేరుతో ఈ నెల 16న విడుదల కానుంది. గతవారం కన్నడలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్‌గా సాగుతోంది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్ నిర్మాతలు. తెలుగు, కన్నడలో ఏకకాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ `` నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. హారర్ జోనర్‌లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవలే కన్నడలో విడుదలై అమితమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇటీవల విడుదలైన తెలుగు టీజర్ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉందని చాలా మంది చెబుతున్నారు. వేణు కెమెరా పనితనం, రవిచంద్రకుమార్ ఎడిటింగ్ తెలుగు ప్రేక్షకులనూ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారు`` అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``హారర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ జరుగుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. `రంగి తరంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చక్కటి బాణీలను ఇచ్చారు. కన్నడలో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. కన్నడలో గొప్ప విజయాన్ని మూటగట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 16న విడుదల చేస్తాం`` అని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







