దుబాయ్‌లో రోడ్డు దుర్ఘటన
- December 08, 2016
దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండడంతో రహదారి సరిగా కనిపించక పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రక్తస్రావం తీవ్రంగా కావడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక రాజస్థాన్‌లో ఏడు వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. జైపూర్-ఆగ్రా హైవేపై ఒక ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో దాని వెనుక వస్తున్న వాహనాలన్నీ ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







