ఆసియా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఎంపికైన దీపికా పదుకొణె

- December 08, 2016 , by Maagulf
ఆసియా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఎంపికైన దీపికా పదుకొణె

అగ్రకథానాయిక దీపికా పదుకొణెను 2016 ఆసియా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా బ్రిటన్‌కి చెందిన ఈస్టర్స్‌ ఐ వార్తాపత్రిక ప్రకటించింది. ప్రియాంక చోప్రాను ఈ పత్రిక ఇప్పటి వరకు ఆసియా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా నాలుగు సార్లు ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆ స్థానాన్ని దీపిక సొంతం చేసుకున్నారు. ఈ వార్షిక పోల్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలమందితో నిర్వహించిన ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ప్రటించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. 'ఇది నా ముఖంపై చిరునవ్వును తెప్పిస్తోంది. కానీ సెక్సీ అనేది వివిధ రకాల వ్యక్తులకు వివిధ రకాలుగా అర్థమౌతుంది. నా దృష్టిలో మాత్రం.

అది శరీరానికి సంబంధించింది కాదు. నీకున్న దానిలో నీవు సౌకర్యంగా ఉండటమే సెక్సీ. ధైర్యంగా, అమాయకత్వం ఉండటం సెక్సీ అనే పదానికి నా దృష్టిలో అర్థం' అని అన్నారు. నాలుగు సార్లు తొలి స్థానం దక్కించుకున్న ప్రియాంక ఈ సారి రెండో స్థానంలో నిలిచారు. ఈ విధంగా టాప్‌ 10లో ఉన్న వారి జాబితాను పరిశీలిస్తే.. ఎప్పుడూ టాప్‌ 10లో ఉండే ఆలియా భట్‌ తొలిసారి 5 స్థానంలో నిలిచారు. నటి నియాశర్మ మూడో స్థానం సెక్సీయస్ట్‌ టెలివిజన్‌ స్టార్‌గా టైటిల్‌ దక్కించుకున్నారు. బుల్లితెర నటి ద్రాష్టి ధామి 4, సనయా ఇరానీ 6, కత్రినా కైఫ్‌ 7, సోనమ్‌ కపూర్‌ 8, పాకిస్థాన్‌ నటి మహీరా ఖాన్‌ 9, గౌహర్‌ఖాన్‌ 10 స్థానాల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com