పెరుగు చేప
- December 08, 2016
కావలసిన పదార్థాలు: ముల్లులేని చేపముక్కలు (నలుపలకలుగా ఉన్నవి) - 800 గ్రా., నూనె - 80 గ్రా., యాలకులు - 4, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లం పేస్టు - 40 గ్రా., ఉల్లిపాయ పేస్టు - 250 గ్రా., గిలక్కొట్టిన పెరుగు - 250 గ్రా., పసుపు - 1 టీ స్పూను, మసాలా పొడి - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నీరు - 150 మిల్లీ లీటర్లు.
తయారుచేసే విధానం: లోతులేని కడాయిలో నూనె వేడిచేసి చేప ముక్కల్ని రెండు వైపులా వేగించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేసి యాలకుల్ని , అల్లం పేస్టుని వేసి వేగించుకోవాలి. ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, పెరుగుని వేసి సన్నని సెగమీద చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత నీరుని జతచేయాలి. అది మరుగుతుండగా వేగించి పక్కనుంచుకున్న చేపముక్కల్ని వేసి ఉడికించి, మసాలాపొడి వేసి దించేసి వేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







