నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది...
- December 09, 2016
హైదరాబాద్ నానక్‌రాంగూడలో గురువారం రాత్రి ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ ఘటనోల శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత పూర్తయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
అధికారుల పర్యవేక్షణలో సహాయ సిబ్బంది గురువారం రాత్రి నుంచి డ కష్టపడి శిథిలాల నుంచి మృతదేహాలను శుక్రవారం అర్ధరాత్రికి వెలికి తీయగలిగారు. మంత్రి కెటి రామారావు, మేయర్ రామ్మోహన్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ చివరి వరకూ ఘటనాస్థలిలోనే ఉండిపోయారు. పంచనామా అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపిస్తామని, మృతుల బంధువులు కూడా వారి స్వగ్రమానికి వెళ్లేందుకు బస్సు ఏర్పాట్లు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.కాగా, భవనం యజమాని సత్తుసింగ్‌ను పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు జిహెచ్ఎంసి అధికారులను సస్పెండ్ చేశారు . ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బలిజపేట మండలానికి చెందినవారే. చిలకపల్లి గ్రామానికి చెందిన నేతేటి సాంబయ్య(40), నానక్‌రాంగూడ లోథా బస్తీలో కొత్తగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనంలో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య పైడమ్మ (35), కూతురు గౌరి(13)తో కలిసి అక్కడే ఉంటున్నాడు.అదే గ్రామానికి చెందిన మరికొందరు భవనంలోని గదులను తీర్చిదిదేందుకు అక్కడ పనిలో చేరారు. సెల్లార్లోనే నివాసముంటూ పనులు చేస్తున్నారు. వారిలో కోమటిపల్లి పోలినాయుడు(30), అతడి భార్య వెంకటలక్ష్మి(25), పిరిడి పోలినాయుడు(25), భార్య నారాయణమ్మ(23), కుమారుడు మోహన్(3), నాదగళ్ల శంకర్(23), దుర్గారావు(25)లతోపాటు సుభద్ర గ్రామానికి చెందిన శివ(25), అతని భార్య రేఖ(25) కుమారుడు దీపక్(4)లు ఉన్నారు.
గురువారం ఉద యం నుంచి రాత్రి వరకూ భవనానికి రంగులు, సున్నం వేశారు. పనులు పూర్తయ్యాక అందరూ కలసి భోజనాలు పూర్తిచేశారు. నిద్రకు ఉపక్రమించే సమయంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భవనం కూలింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







