తీవ్రవాదం కారణంగా ఇరువురు పౌరులకు జైలుశిక్ష
- December 10, 2016
జెడ్డా : సిరియా ప్రయాణించి జాబ్స్ అల్- నుస్ర లో ఆయుధ శిక్షణ తీసుకొనివచ్చిన ఒక పౌరునికి ఆరు సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. అంతేకాక ఆ నిందితుడు రాజ్యానికి వ్యతిరేకంగా సవాలు చేయడమే కాక దేశం యొక్క ప్రభుత్వ మరియు మత పండితులను అవమానిస్తూ ప్రకటనలు చేస్తూ వివాదం నెలకొని ఉన్న మండలాలలో ప్రజలు పోరాడాలని రెచ్చగొడ్తు సామాజిక మీడియా ద్వారా తీవ్రవాదులతో అనుబంధం కల్గి ఉండటంతో సహా పలు ఇతర ఆరోపణలు మోపబడ్డాయి.6 సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాల కాలం ఫిబ్రవరి 13 వ తేదీ 2013 న జారీ కాబడిన ఆజ్ఞపత్రం ఉల్లంఘించినందుకు, మిగిలిన 3 సంవత్సరాల శిక్ష సైబర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించబడింది. ప్రతివాది యొక్క ట్విట్టర్ ఖాతాని మూసివేయాలని కోర్టు ప్రకటించింది. సైబర్ నేరాల నిబంధనలు ఆధారంగా అధికరణం13 ప్రకారం నిషేధించారు.అంతేకాక కాకుండా జైలుశిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ళపాటు ఎటువంటి ప్రయాణం చేయకూడదని నిషేధం విధించింది. ఆదివారం, ఇదే కోర్టు, సౌదీ పౌరునికి 30 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. కింగ్డమ్ ప్రభుత్వ తీరుని అవినీతికి పాల్పడుతున్న విషయంపై అవమానకరమైన వాఖ్యలు చేశాడు. అంతేకాక క్వాటిప్ ప్రాంతంలో లో మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు తుపాకీలను ఉపయోగించి భద్రతా నిబంధనలన ఉల్లంఘించినందుకు సౌదీ జాతీయునికి శిక్ష విధించారు.అంతేకాక ఆ నిందితుడు అప్అమియహ్ పోలీసు స్టేషన్ సమీపంలో ఒక గ్యాస్ పైపులైన్ పేల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీనితో నిందితునికి 10,000 సౌదీ రియళ్ళు జరిమానా మరియు 30 ఏళ్ల జైలుశిక్ష ఆ తర్వాత ప్రయాణ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







