చెన్నై మహానగరంలో కుక్క బిర్యానీ ..!

- December 11, 2016 , by Maagulf
చెన్నై మహానగరంలో  కుక్క బిర్యానీ ..!

చెన్నై మహానగరంలో ఇప్పుడు కుక్క బిర్యానీ కూడా లభిస్తోంది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ ఇంట్లో కుక్కను కోసి, దాని చర్మాన్ని తీసిన ఫొటోలు ఇప్పు డు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాస్తవానికి చెన్నై నగరంలో కొన్ని రోజులకు ముందు కుక్క, పిల్లి బిర్యానీలు విక్రయిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తతో అప్రమత్తమైన కార్పొ రేషన్‌ ఆహార భద్రత తనిఖీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. ఆ సమయంలో కొంతమంది సంచారజాతుల వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత చికెన్‌ బిర్యానీ పేరుతో కాకి బిర్యానీ విక్రయించారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కుక్క బిర్యానీ విక్రయిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి.

వీటిని రుజువు చేసేలా... శునకం గొంతుకోసి, చర్మాన్ని తొలగించిన ఫొటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com