బహ్రెయిన్ లో దేశీయంగా తయారైన బాంబులు- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- September 04, 2015
గత కొన్ని సంవత్సరాలుగా బహ్రైన్ లో వేర్పాటువాద శక్తులు ఆధునిక ప్రేలుడు పదార్ధాలను స్థానికంగానే తయారుచేసి పాతిపెడుతున్నారని బహ్రైన్ లో బ్రిటిష్ బాంబుల నిర్వీర్య నిపుణుడు అంథోనీ జార్ తెలియజేశారు. జులై 28 మరియు అగస్ట్ 28 లలో వరుసగా సిట్ర మరియు కరన్నాలలో పేలిన బాంబులు ముగ్గురు పోలీసులను బలిగొని, మరి 13 మందిని గాయపర్చిన అనంతరం సంఘటనలపై స్పందిస్తూ ఈ బాంబులను మొబైల్ ఫోన్ లేదా కేవలం ఒక వైర్ లెస్ పరికరం ద్వారానైనా కూడా పనిచేయించవచ్చని, ఈ తయారీ పదార్ధాలు దైనందిన జీవితంలో కూడా వాడేవైనందున వాటిని నిషేధించలేమని అన్నారు. వాటిని సమిష్టికృషి, ప్రయత్నాల ద్వారానే నిరోధించగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ విధమైన అనుమానాస్పద పరికరాలు కానీ సంఘటనలు కానీ గమనించినపుడు హాట్ లైన్ నంబర్ - 80008008 కు సమాచారమీయవలసిందిగా ప్రజలను రక్షణ శాఖ అధికారులు కోరారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







