ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది...
- December 13, 2016
త్తరాదిని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిదవుతున్నా సూర్యోదయం కాలేదు. దీంతో రోడ్ల మీద జనసంచారం కనిపించడం లేదు. ఉదయాన్నే బయటకు వెళ్లాల్సిన కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విజుబులిటీ తక్కువగా ఉంది. వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. మసక చీకటి ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరతాయని అధికారులు తెలిపారు. .అటు వారణాసిలో పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వెలుతురు తక్కువగా ఉండడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లపై జనాలు, వాహనాల సందడి కనిపించడం లేదు. అరకొరగానే వాహనాలు రోడ్డెక్కాయి. పొగ మంచుతో పాటు చలి ఎక్కువగా ఉండడంతో వాకింగ్ వెళ్లే వారు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జనం చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో చలి పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
-
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







