ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది...

- December 13, 2016 , by Maagulf
ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది...

త్తరాదిని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా  పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిదవుతున్నా సూర్యోదయం కాలేదు. దీంతో రోడ్ల మీద జనసంచారం కనిపించడం లేదు. ఉదయాన్నే బయటకు వెళ్లాల్సిన కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విజుబులిటీ తక్కువగా ఉంది. వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. మసక చీకటి ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరతాయని అధికారులు తెలిపారు. .అటు వారణాసిలో పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వెలుతురు తక్కువగా ఉండడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది.  రోడ్లపై జనాలు, వాహనాల సందడి కనిపించడం లేదు. అరకొరగానే వాహనాలు రోడ్డెక్కాయి. పొగ మంచుతో పాటు చలి ఎక్కువగా ఉండడంతో వాకింగ్‌ వెళ్లే వారు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జనం చలి మంటలు  వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో చలి పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

-

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com