అబుదాబీ ఫుడ్‌ ఫెస్టివల్‌లో నోరూరించే రుచులు

- December 14, 2016 , by Maagulf
అబుదాబీ ఫుడ్‌ ఫెస్టివల్‌లో నోరూరించే రుచులు

అబుదాబీ ఫుడ్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో రస్టీట్‌ ఫీస్ట్‌ రోల్స్‌ క్యాపిటల్‌ వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఈ వీకెండ్‌ భోజన ప్రియులకు చవులూరించే వెరైటీ వంటకాలు స్వాగతం పలకనున్నాయి. మూడు రోజులపాటు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వెరైటీ వంటకాలు ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. గత వారం అల్‌ అయిన్‌లో ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. 20కి పైగా ఫుడ్‌ ట్రక్స్‌, తమ స్పెషాలిటీస్‌తో హజ్జా బిన్‌ జాయెద్‌ స్టేడియంలో సందడి చేశాయి. అబుదాబీ ఫుడ్‌ ఫెస్టివల్‌లో తమ ప్రత్యేకతను చాటుకోబోతున్నామనీ, పాలస్తీనియన్‌ ఫుడ్‌ తమ వద్ద ఫేమస్‌ అని ఒసిద్‌ తప్తానాజి అనే హెడ్‌ చెఫ్‌ చెప్పారు. మమాయెష్‌ దుబాయ్‌ బిజినెస్‌ బేలో ఏడాది క్రితం ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంది మమాయిష్‌ అని ఒసిద్‌ వివరించారు. ది షెబి అనే సంస్థ ఇండియన్‌, లెబనీస్‌ ఫుజన్‌ ఫుడ్‌ని పరిచయం చేస్తోంది. ఏడాది కాలంగా తమ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధించిందని షెబి మేనేజర్‌ జాయ్‌స్‌ పగ్లినవాన్‌ చెప్పారు. స్ట్రీట్‌ ఫీస్ట్‌లో పిల్లల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌తోపాటు, స్ట్రీట్‌ పెర్ఫామెన్స్‌లు, ఔట్‌డోర్‌ సినిమా, లైవ్‌ పెర్ఫామెన్స్‌లు ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com