హైదరాబాద్ లో అక్రమకట్టడాలపై హెచ్ఎండీఏ కన్నెర్ర

- December 14, 2016 , by Maagulf
హైదరాబాద్ లో అక్రమకట్టడాలపై హెచ్ఎండీఏ కన్నెర్ర

నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బుధవారం కూకట్‌పల్లి మధురానగర్‌లో అనుమతిలేకుండా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. రెండు అంతస్థులకు అనుమతులు తీసుకుని ఏడు అంతస్థులు నిర్మిస్తున్న ప్రతీ అక్రమ కట్టడాన్ని జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. నిన్న సాయంత్రం దాదాపు 10 భవనాలను కూల్చివేశారు. మధురానగర్‌లో అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. బండారి లేఅవుట్‌లో 34, నిజాంపేట 110 అక్రమకట్టడాలను గుర్తించామని అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com