జలుబుకు అల్లం దివ్యౌషధం
- December 14, 2016
శీతాకాలంలో ఏర్పడే జలుబుకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అజీర్తిని నివారించడంలో అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంకు చెక్ పెడుతుంది. అల్లంలోని కొన్ని ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. గుండెపోటును నిరోధిస్తాయి. తోలు తీసేసిన అల్లం ముక్కను దంచి ఒక కప్పు పాలలో చేర్చి మరిగించి.. వడగట్టి కలకండతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చు.
అలాగే అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనారసం, ఒక స్పూన్ తేనె ఈ నాలుగింటిని కలిపి.. ప్రతి రోజూ ముడు పూటలా తీసుకుంటే.. పిత్త సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొవ్వును తగ్గించుకోవచ్చు. అల్లం రసంతో తేనెను కలుపుకుని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే జలుబు మటాష్ అవుతుంది.
అర స్పూన్ అల్లం రసంతో హాఫ్ బాయిల్డ్ ఎగ్‌తో తేనెను కలిపి తీసుకుంటే రోజుకొకటి చొప్పున నెలపాటు తీసుకుంటే నరాల బలహీనతను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









