దుబాయ్ లో నివసించే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్..
- December 14, 2016
దుబాయ్ లో నివసించే వారెవరైనా ఇకనుంచి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. వచ్చే జనవరి 1 నుంచి దుబాయ్ లో నివసించే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఇన్సూరెన్స్ లేని పక్షంలో నెలకు 500 వందల దిర్హమ్స్ (ఇప్పుడున్న రేటు ప్రకారం దాదాపు 9 వేల రూపాయలు) జరిమానా వేస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక వీసా రెన్యువల్ చేయరు. ఉన్న వీసాకు పొడగింపు కూడా అనుమతివ్వరని నిబంధనలు పెట్టారు.
దుబాయ్ లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇకనుంచి వారిని స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించాలి. లేదా, పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం సిబ్బందికి ఇన్సూరెన్స్ చెల్లించాలి.
అలా చేయని పక్షంలో సొంతగానైనా హెల్త్ ఇన్సూరెన్స్ విధిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కనుక ఒక్క ఉద్యోగికి మాత్రమే ఇన్సూరెన్స్ కల్పిస్తే ఆ ఉద్యోగి తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా అందులో చేర్పించుకోవాలి.
ఆ మేరకు వచ్చే జనవరి 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్ ఏ), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్ అఫేర్స్ (జీడీఆర్ ఎఫ్ ఎ) ప్రకటించింది. అయితే ఈ తప్పని సరి ఇన్సూరెన్స్ ఒక్క దుబాయ్ లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దుబాయ్ లోని అన్ని కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్ల జాబితాలను సమర్పించాలని డీహెచ్ ఏ ఆదేశాలు జారీ చేసింది.
ఇన్సూరెన్స్ కోసం రకరకాల ప్లాన్స్ ఇవ్వగా, అందులో బేసిక్ ప్లాన్ ప్రకారం ఏడాదికి 565 నుంచి 650 దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 4 వేలకు తక్కువగా వేతనం పొందే వారి కోసం ఈ బేసిక్ ప్లాన్ రూపొందించినట్టు అధికారులు వివరించారు. బేసిక్ ప్లాన్ పై 1,50,000 దిర్హమ్స్ కవరేజీ ఉంటుందని డీహెచ్ ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ హైదర్ అల్ యూసుఫ్ తెలిపారు.
భారత దేశం నుంచి వెళ్ల అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, వివిధ కంపెనీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఇన్సూరెన్స్ సొమ్ము భరించని పక్షంలో అలాంటి వారందరికీ ఎంతో భారంగా మారుతుందని చిన్నా చితకా పనులు చేసుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా భారత్ నుంచి యూఈఏ కు వలస వెళ్లిన వాళ్లు మొత్తం 40లక్షల మంది ఉండగా వారిలో కేరళ నుంచి పది లక్షల మంది, తమిళనాడు నుంచి నాలుగున్నర లక్షలమంది, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారున్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ నిబంధన దుబాయ్ లో మాత్రమే అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







