నది మధ్యలో బోట్‌లో జిమ్‌...

- December 15, 2016 , by Maagulf
నది మధ్యలో బోట్‌లో జిమ్‌...

నది మధ్యలో బోట్‌లో జిమ్‌ చేస్తే ఎలా ఉంటుంది. ఆ కిక్కే వేరు. అలాంటి వారి కోసం ప్యారిస్‌లో ఓ స్పెషల్‌ పడవ రెడీ అవుతోంది. ప్యారిస్‌లోని సీన్‌ నదిని దాటేందుకు డిజైన్‌ చేసిన ఈ బోట్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అయ్యింది. అంతేకాదు ఈ పడవ పెట్రోలు, డీజిల్‌తో కాకుండా... జిమ్‌ లోపలున్న వాళ్లు సైకిల్‌ తొక్కితేనే నడుస్తుంది. 20 మీటర్ల పొడవున్న ఈ పడవలో సైకిల్‌ తొక్కినా... బరువులెత్తినా ఆ శక్తిని ఇవి విద్యుత్తుగా మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తాయి. ఈ స్పెషల్‌ జిమ్‌లో ఒకేసారి 45 మంది వరకూ వ్యాయామం చేయొచ్చు. వచ్చే ఏడాది వేసవిలో ఈ పడవ జిమ్‌ను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com