ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం
- December 18, 2016
ఆదివారం తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రవాసీ మిత్ర, కొయలిషన్ ఆఫ్ ఓవర్సిస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోటా) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిశభ కనబర్చిన ఆసే్ట్రలియా, కువైట్, మలేషియా, న్యూజిలాండ్, నైజిరియా, ఓమాన్, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ఆఫ్రికా, యూఏఈ, యూకే తదితర దేశాలకు చెందిన సుమారు 26మంది ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ)లకు ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. వీరితో పాటు భారతదేశంలో సేవలందిస్తున్న ప్రవాసీయులను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు ఖ్యాతి, దేశ ప్రగతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన సూచించారు. అవార్డుగ్రహీతలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో నివసించినా భారతమాత ముద్దు బిడ్డలుగా జీవిస్తామని వారన్నారు. విదేశాలలో మన దేశం వారికి కలిగే సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి సన, సంస్థ అధ్యక్షుడు మంద భీమ్‌రెడ్డి, దర్శకుడు రేలంగి నర్సింహారావు, అడప సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









