బ్లాక్‌మనీపై 4 వేల ఈ-మెయిల్స్!
- December 20, 2016
నల్లధనం, అక్రమ లావాదేవీలపై సమాచారం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ-మెయిల్ అడ్రస్‌కు ప్రజా వేగుల (విజిల్ బ్లోయర్స్) నుంచి విశేష స్పందన వెల్లువెత్తుతోంది. blackmoneyinfo@incometax. gov.in కు కేవలం 72 గంటల్లో 4,000 పైగా ఈ మెయిళ్లు పోటెత్తినట్టు ఆర్థిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నల్లకుబేరులపై ఆదాయపన్ను అధికారులు, బ్యాంకు డిపాజిట్ల ఆధారంగా ఇతర దర్యాప్తు సంస్థల వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున సమాచారం ఉందనీ... నల్లధనాన్ని పసిగట్టడంలో ప్రజల నుంచి వచ్చిన సమాచారం మరింత అదనపు బలాన్ని ఇస్తుందని తెలిపారు. దీంతోపాటు లెక్కల్లో చూపని ఆదాయంపై ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయూ) ద్వారా కూడా దర్యాప్తు జరుగుతోంది.
ప్రజావేగుల ఈ మెయిళ్ల ద్వారా అందిన వివరాలతో నల్లధనాన్ని వేళ్లతో సహా పెకిలించ వచ్చునని కేంద్రం భావిస్తోంది. ఐటీ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించి పెద్దమొత్తంలో కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా ఆదాయ వెల్లడి పథకం 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' ప్రారంభం సందర్భంగా ఈ మెయిల్ అడ్రస్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









