మెక్సికో బాణాసంచా మార్కెట్‌లో పేలుడు 26 మంది మృతి..
- December 20, 2016
మెక్సికోలో జరిగిన భారీ పేలుడులో 26 మంది మృతిచెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని నగరమైన మెక్సికో సిటీలోని బాణాసంచా మార్కెట్‌లో మంగళవారం రాత్రిఈ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మార్కెట్ మొత్తం దగ్ధమైంది. మూడు గంటలు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.
ఈ పేలుడుపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియోటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









