రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్రూక్‌ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒప్పందం..
- December 21, 2016
అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన , టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను బ్రూక్ ఫీల్డ్ కు విక్రయించింది. ఈ మేరకు కెనడా కు చెందిన బ్రూక్‌ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో తప్పనిసరి (రెండు వైపులా బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం తెలియజేసింది. దీంతో బ్రూక్‌ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ. 11,000 కోట్లను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ బైండింగ్ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది.
ఈ తాజా ఒప్పందం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకోనుంది.
మరోవైపు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన మరో సంస్థ రిలయన్స్ కేపిటల్ కూడా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.హోమ్ ఫైనాన్స్ ద్వారా అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ, 1,000 కోట్లను(14.7 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపింది.కాగా ఆర్ కాం మొబైల్ టవర్ వ్యాపార వాటా విక్రయానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి కెనడా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్లో ఆర్‌కామ్ షేరు దాదాపు 8 శాతానిపై దూసుకెళ్లింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







