యూఏఈలో వాతావరణం: 9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 21, 2016
దుబాయ్: వింటర్ అధికారికంగా ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. యూఏఈలోని పర్వత ప్రాంతాల్లో ఇప్పటికే కనిష్టంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అల్ అయిన్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్సా ప్రాంతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చలికాలం ప్రారంభమవడంతో ప్రజలు వెచ్చని వాతావరణం కోసం పరితపిస్తున్నారు. తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు వింటర్ వేర్ని ఆశ్రయించడం జరుగుతోంది. కోస్టల్ ఏరియాస్‌లో 24 డిగ్రీలు నమోదవుతుండగా, ఇంటర్నల్ ఏరియాస్‌లో 27 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం చాలా సమయంపాటు పొగ మంచు కన్పిస్తోంది. అలాగే సాయంత్రం కూడా పొగమంచు ఎక్కువగానే ఉంటోంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అండ్ మెటియరాలజీ, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, రోడ్లపై పొగమంచు కారణంగా విజిబులిటీ చాలా బ్యాడ్‌గా ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం వరకు పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ పరిస్థితుల్ని వివరించింది ఎన్‌సిఎంఎస్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







