మరోసారి 'నిర్భయ్‌' క్షిపణి విఫలం

- December 21, 2016 , by Maagulf
మరోసారి 'నిర్భయ్‌' క్షిపణి విఫలం

అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నిర్భయ్‌ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. ఈ ప్రయోగం విఫలమవడం ఇది మూడోసారి. ఒడిశాలోని బాలాసోర్‌ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని బుధవారం ప్రయోగించారు. భూ ఉపరితలంపై వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందించిన ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ మూడో వేదిక నుంచి ప్రయోగించగా.. నిర్దేశిత మార్గంలో ఇది వెళ్లలేదని డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి.మార్చి 2013లో మొదటిసారి నిర్భయ్‌ క్షిపణి ప్రయోగం చేపట్టగా అది పూర్తిగా విఫలమైంది. అక్టోబర్‌ 2014లో చేపట్టిన రెండో ప్రయోగం విజయవంతమైంది. అయితే నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులు ఇది 1,010 కి.మీ ప్రయాణించింది. అక్టోబర్‌ 2015న చేపట్టిన మూడో ప్రయోగం, ఇవాళ చేపట్టిన నాలుగో ప్రయోగం పూర్తిగా విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com