ఒక్కడొచ్చాడు: సెన్సార్ రివ్యూ..
- December 22, 2016
తమిళ్ హీరో విశాల్ కి టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. 'పందెం కోడి' నుంచి విశాల్ ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతూ వస్తోంది. విశాల్ తాజా చిత్రం 'ఒక్కడొచ్చాడు'. సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా జతకట్టింది. క్రిస్మస్ కానుకగా 'ఒక్కడొచ్చాడు' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ రిపోర్స్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది.
సెన్సార్ బోర్డు 'ఒక్కడొచ్చాడు'కి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ని జారీచేసింది. 'ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆకట్టుకొనే విధంగా ఉంది. తమన్నా హాట్ హాట్ అందాలతో కనువిందు చేయనుంది.
జగపతిబాబు పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనుంది. మొత్తానికి.. ఒక్కడొచ్చాడు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకొనే ఉందనేది సెన్సార్ సభ్యుల టాక్'.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే దాదాపు 2,100 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం హిప్ హాప్ తమిళ. జి.హరి నిర్మాత.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







