మెగాస్టార్ స్పెషల్ బుక్ ఎడిషన్!

- December 22, 2016 , by Maagulf
మెగాస్టార్  స్పెషల్ బుక్ ఎడిషన్!

మెగా ఫీవర్ ని మెల్లగా స్లో పాయిజన్ లాగా స్ప్రెడ్ చేయటం కోసం రామ చరణ్ తేజ్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా ముందుకు సాగుతోంది. సంక్రాంతికి విడుదల కానున్న 'ఖైది నంబర్ 150'పై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉండగా దాన్ని మరింత పెంచే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మొదట్లో ఫస్ట్ లుక్స్ తో సరిపెట్టిన సినిమా యూనిట్ రాన్రాను డోస్ పెంచి వీక్లీ అప్ డేట్స్ మీద ఫోకస్ పెంచారు. సండే రిలీజ్ చేసిన 'అమ్మడు కుమ్ముడు' సాంగ్ ఇప్పటికే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేవి రెగ్యులర్ ట్యూన్ తో పాత బీట్స్ నే రిపీట్ చేసాడు అన్న విమర్శలు వినపడుతున్న నేపధ్యంలో నిన్న దాని మేకింగ్ వీడియో రిలీజ్ చేసి మరింత జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

సాంగ్ ఎంత యావరేజ్ గా ఉన్నా తన డ్యాన్సింగ్ మేజిక్ తో హాల్స్ ని షేక్ చేయటం ఖాయం అనిపించేలా ఆ వీడియో బిట్ ఉండటంతో ఫాన్స్ హ్యాపీ గా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఆడియోని నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పటికీ కుదరకపోవడంతో జనవరి 4 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు ఫాన్స్ కోసం. పవన్ తో సహా మెగా కుటుంబం మొత్తం ఆ వేదిక పై కనపడనున్నది అని టాక్. ప్రస్తుతం పోలాచ్చిలో ఉన్న పవన్ ఆ డేట్ కి అందుబాటులో ఉంటానని చెర్రీకి చెప్పాడట.
ఇక 'ఖైది నంబర్ 150'కి సంబంధించి మరోవిశేషం కూడా బయటికి వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా దానికి సంబందించిన మేకింగ్ న్యూస్ తో పాటు, ఆ మూవీ పని చేసిన వాళ్ళందరి ఇంటర్వ్యూలు, స్టిల్స్, ఫోటోగ్రాఫ్స్ తో పాటు చిరు నట జీవితానికి సంబందించిన విశేషాలతో కూడిన ఒక స్పెషల్ బుక్ ఎడిషన్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ లో ఉన్నాడు చెర్రీ. ఇలాగే రెండు నెలల క్రితం మోహన్ బాబు మీద కూడా ఓ పుస్తకం రిలీజ్ చేసాడు మంచు విష్ణు. కాని అందులో కేవలం తన తండ్రి పాపులర్ డైలాగ్స్ ను ఫోకస్ చేసాడు. కాని చిరు బుక్ లో మాత్రం బోలెడు విశేషాలు ఉంటాయని తెలుస్తోంది. 1989 నుంచి దాదాపు 5 సంవత్సరాల పాటు చిరంజీవి పేరు ఏకంగా ఒక మ్యగజైన్ కూడా రన్ చేసారు దర్శకుడు విజయబాపినీడు. అప్పట్లో అది పెద్ద సంచలనం. పేరొందిన మాస పత్రికలే 5/- రూపాయలున్న ఆ రోజుల్లో చిరు పత్రిక మాత్రం అత్యున్నత క్వాలిటీతో 10/- నుంచి 20/- రూపాయలకు అమ్మినా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. చిరు మేనియా అలాంటిది. ఇప్పుడు ఈ స్పెషల్ బుక్ న్యూస్ చదివి ఎప్పుడెప్పుడు ఆ బుక్ చదువుతామా అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com