జియో న్యూఇయర్ ఆఫర్..
- December 23, 2016
న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో టెలికాం కంపెనీ అలర్టయ్యాయి. రకరకాల ప్లాన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. లేటెస్ట్‌గా జియో మరో అడుగు ముందుకేయనుంది. ఉచిత కాల్స్, ఉచిత డేటా సౌకర్యంతో కస్టమర్స్‌కి చేరువైన జియో, ఈ సేవలన్నీ ఇప్పటివరకు 4జీ ఫోన్లలో మాత్రమే! తాజాగా జియో సిమ్‌లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా ఆ సంస్థ ఓ యాప్‌ను రూపొందించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల చివర లేదా వచ్చేనెలలో ఆ యాప్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1న నుంచి 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. రాబోయే 3జీ జియో సిమ్ ద్వారా కస్టమర్లు పెరిగే ఛాన్స్ వుందని అప్పుడే లెక్కల్లో నిమగ్నమైంది ఆ కంపెనీ.
మరోవైపు జియో దెబ్బకు తన పాత విధానాలను సడలిస్తోంది ఎయిర్ టెల్. ముంబైలో ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్ల కోసం ఆ కంపెనీ సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రిలీజ్ చేసింది. కొత్త ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు తొలి మూడునెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపారు. 10 జీబీ కలిగిన బేసిక్ ప్లాన్ రూ. 599లతో ప్రారంభం అవుతుందని, అలాగే రూ. 1,299 ల రెంటల్‌తో నెలకు 60 జీబీ డేటా ప్లాన్‌ను తీసుకునేవారికి ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే తమకు 3.51 లక్షల ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లున్నారని, వీరిలో ఎక్కువశాతం ఎంటర్‌ప్రైజెస్ వినియోగదారులేనట. వి-ఫైబర్ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్‌లైన్ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించే విధంగా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసింది ఎయిర్‌టెల్. దీనిద్వారా 100 ఎంబిపిఎస్ వరకు వేగంతో డేటాను అందించనుం
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







