' ఢీ ' కొన్న రెండు పడవలు ఇరువురికి గాయాలు మరొకరు గల్లంతు ..

- December 23, 2016 , by Maagulf
' ఢీ ' కొన్న రెండు పడవలు ఇరువురికి గాయాలు మరొకరు గల్లంతు ..

మస్కట్ : రహదారి మీద వాహనాలు తప్పుకునే స్థలం లేక ప్రమాదాలు జరగడం వేరు...విశాలమైన నీటిలో ఇంకేమాత్రం చోటు లేదనట్టుగా రెండు పడవలు సరిగ్గా ఎదురెదురుగా ప్రయాణిస్తూ ' ఢీ '  కోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముసణ్డం రాజ్యము లోని ఖశబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ నీటి ప్రమాదంలో రెండు పడవలు తునాతునకలయ్యాయని  మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ గురువారం నివేదించారు. కాగా, రెండు పడవల ' ఢీ '  కొన్న ప్రమాదంలో మధ్యస్తంగా గాయపడిన ఇరువురు వ్యక్తులను స్థానిక పౌరులు రక్షించగా, గల్లంతయిన మూడవ వ్యక్తి కోసం సివిల్ డిఫెన్స్ జట్లు నీటిలో శోధిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com