క్రైమ్‌ ప్రిడిక్షన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఆవిష్కరించిన దుబాయ్‌ పోలీస్‌

- December 24, 2016 , by Maagulf
క్రైమ్‌ ప్రిడిక్షన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఆవిష్కరించిన దుబాయ్‌ పోలీస్‌

స్పేస్‌ ఇమేజింగ్‌ మిడిల్‌ ఈస్ట్‌ (ఎస్‌ఐఎంఇ) క్రైమ్‌ ప్రిడిక్షన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ని ప్రారంభించింది. నేరాలను ముందుగానే ఊహించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాల్ని తగ్గించడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడ్తుంది. దుబాయ్‌ పోలీసుల అమ్ముల పొదిలో ఓ అస్త్రంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ రీజియన్‌లో ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ ఇప్పటిదాకా ఎవరూ వినియోగించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌ పోలీస్‌ ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని వినియోగించి, ముందడుగు వేస్తోందనీ, నేరాల్ని తగ్గించడంలో దుబాయ్‌ పోలీసుల కమిట్‌మెంట్‌ చాలా గొప్పదని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పారు. ఎస్‌ఐఎంఇ - జిఐఎస్‌ డివిజన్‌ హెడ్‌ స్పందన్‌ కౌర్‌ మాట్లాడుతూ, ఈ సాఫ్ట్‌వేర్‌ చాలా ఇంటెల్లిజెంట్‌గా వ్యవహరిస్తుందని, అత్యంత ఖచ్చితత్వంతో దుబాయ్‌ పోలీసులకు సేవలు అందిస్తుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com