పిట్టగోడ :రివ్యూ

- December 24, 2016 , by Maagulf

 
నటీనటులు: విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి భూపాలం, ఉయ్యాల జంపాల రాజు, జబర్దస్త్‌ రాజు, శివ, ఆర్‌.ఎస్‌, శ్రీకాంత్‌ తదితరులు 
సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌ 
ఛాయాగ్రహణం: దినేష్‌ కుమార్‌ 
నిర్మాతలు: దినేష్‌ కుమార్‌, రామ్మోహన్‌ పి.సమర్పణ: డి. సురేష్‌ బాబు 
దర్శకత్వం: అనుదీప్‌ కె.వి 
విడుదల తేదీ: 24-12-2016
ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్లలో అత్యధికులు యువతీయువకులే. వాళ్ల ఆలోచనలూ, అభిరుచులకు సినిమా కథ దగ్గరగా ఉంటే... వాళ్లుసులువుగా కనెక్ట్‌ అవుతారు. థియేటర్లూ నిండిపోవడం ఖాయం. అందుకే ఈ తరహా కథలకు డిమాండ్‌. 'నలుగురు స్నేహితులూ, వాళ్ల జీవితాలూ' అంటూ మొదలెడితే ఎన్ని కథల్ని ఆవిష్కరించొచ్చో!! 'హ్యాపీడేస్‌'లా అన్నమాట. 'పిట్టగోడ' కూడా ఆ తరహా కథే. నలుగురు స్నేహితుల ప్రయాణం ఈ సినిమా. మరి దీన్ని తీర్చిదిద్దిన విధానం ఎలా ఉంది... 'పిట్టగోడ' టార్గెట్‌ ఆడియన్స్‌కి ఏమాత్రం నచ్చుతుంది.. వంటివి తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే!
* కథేంటంటే... 
టిప్పు, బిల్డప్‌ వేణు, జ్ఞానేశ్వర్‌, నాగరాజు... గోదావరి ఖనిలో పనీ పాటా లేకుండా తిరిగే బ్యాచ్‌. ఆ వూళ్లొ ఎవరికీ వీళ్లంటే గౌరవం ఉండదు. ఇంట్లో కూడా తిట్లూ చీవాట్లే! వీళ్లేమే 'పిట్టగోడ' ఎక్కి కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్లకు ఆ గోడే ప్రపంచం. తమలోకంలో తాము బతుకుతుంటారు. కానీ ఓ రోజు వాళ్లలోనూ మార్పు వస్తుంది. తమని తాము నిరూపించుకోవాలనీ, వూళ్లొ అందరి ముందూ కాలరెత్తుకొని తిరగాలనీ అనుకొంటారు. టిప్పు... దివ్య అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కథే... అందరి జీవితాల్నీ ఓ కొత్త దారిలోకి మళ్లిస్తుంది. అదేంటన్నది తెరపై చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com