'కేశవ' ఫస్ట్‌లుక్‌!

- December 24, 2016 , by Maagulf

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నిఖిల్‌ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో 'కేశవ' అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. నిఖిల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ''ఎక్కడి పోతావు చిన్నవాడా' తర్వాత నా చిత్రం ఇది.. నా ఫస్ట్‌లుక్‌తో 'కేశవ' తొలి పోస్టర్‌. 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. పోస్టర్‌లో నిఖిల్‌ చాలా కోపంగా కనిపించారు. ఒక వైపు గుడి గోపురం, మరోవైపు జీపు..రక్తంలో పడి ఉన్న తుపాకీని ఇలా ఆసక్తికరంగా పోస్టర్‌ను చూపించారు.
నిఖిల్‌ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'కేశవ'లో 'పెళ్లి చూపులు' చిత్రంలో నటించిన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com