హైదరాబాద్ లో ఏటీఎంలు బంద్‌..

- December 24, 2016 , by Maagulf
హైదరాబాద్ లో ఏటీఎంలు బంద్‌..

బ్యాంకులకు సెలవు.. తెరుచు కోని ఏటీఎంలతో శనివారం నగరవాసుల కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏటీఎంలలో నగదు వేస్తారని రోజంతా ఏటీఎం చుట్టూ తిరిగిన వా రికి నిరాశే మిగిలింది. ఏటీఎంల్లో నగదు లేక.. బ్యాంకులు తెరుచుకోక నగదు కోసం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పెద్దనోట్లు రద్దయి 46 రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో 90 శాతం ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో ఏటీఎంల ముందు పలువురు చిరువ్యాపారాలు నిర్వహి స్తున్నారు. కోఠి, ఆబిడ్స్‌, చార్మినార్‌ ప్రాంతాల్లో ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు పనిచేయ నప్పుడైనా ఏటీఎంల్లో నగదు వేసేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com