థ్రిల్లర్ సినిమాకి ఓకే చెప్పిన అవసరాల
- December 25, 2016
ఓ పక్క నటుడిగా ఫుల్ ఫాంలో ఉన్న అవసరాల శ్రీనివాస్ డైరక్టర్ గా కూడా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే హంటర్ రీమేక్ లో శృంగార ప్రియుడిగా కనిపించబోతున్న శ్రీని ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసారి థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నాడట అవసరాల శ్రీనివాస్. గ్రీన్ సిగ్నల్ డైరక్టర్ విజయ్ ముద్దాల చెప్పిన కథకు సర్ ప్రైజ్ అయిన అవసరాల సినిమాలో హీరోగా ఓకే చెప్పాడట. ఇక ఇందులో హీరోయిన్ గా రెజినాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. నటుడిగా దర్శకుడిగా అవసరాల ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. హీరోగా మొదటి సినిమా ఇంకా రిలీజ్ అవడానికి ముందే మరో సినిమా చేస్తున్నాడు అంటే అతని మీద దర్శక నిర్మాతలకు ఉన్న నమ్మకం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అవసరాల వరుస సినిమాలు చేస్తుంటడం కుర్ర హీరోలకు షాక్ ఇస్తుంది. దర్శకునిగా హీరోగా అవసరాల క్రేజ్ మాములు రేంజ్లో లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం రొమాంటిక్ సినిమా చేస్తూ వెంటనే థ్రిల్లర్ కథ ఎంచుకోవడంలో అవసరాల ప్లాన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇదే కాకుండా తను డైరెక్ట్ చేసే మూడో సినిమా నానితో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను నానినే నిర్మించే అవకాశాలు ఉన్నాయట. సో నాని అవసరాల క్రేజీ కాబినేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఊహించని రేంజ్లో వరుస సినిమాలు చేస్తున్న అవసరాల సినిమాల ఫలితాన్ని ఎలా అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







