హైదరాబాద్ న్యూఇయర్ వేడుకల్లో భారీగా గంజాయి..
- December 25, 2016
హైదరాబాద్ సిటీలోనే ఏడాదికి అటూ ఇటుగా 6 టన్నుల గంజాయి వినియోగం అవుతోందని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. పక్కరాష్ట్రాల నుంచి రైళ్లలో, వ్యాన్‌లలో సిటీలోకి డంప్ అవుతున్న గంజాయి, గల్లీల్లోకి చేరుతోంది. ఇప్పుడు న్యూఇయర్ వేడుకల్లో భారీగా గంజాయి సరఫరా జరుగుతోందని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టారు.
కిక్కు పలు రకాలు. స్థాయిని బట్టి ఒకరు మద్యంలో తేలియాడితే, మరొకరు నల్లమందు మత్తులో మునిగిపోతారు. వేరొకరు గంజాయి మత్తులో లోకం మర్చిపోతారు. నిన్న డ్రగ్స్, నేడు గంజాయి. న్యూ ఇయర్ వేడుకల్లో యూత్‌ని మత్తులో ముంచెత్తటానికి స్వార్థపరులు రకరకాల మత్తుపదార్థాల్ని సిటీలోకి దింపుతున్నారు. పోలీసులకు పనిపెడుతున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. తాగి తందనాలాడటం, మాదకద్రవ్యాల మత్తులో జోగడమేనా.. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది.. ఓ వైపు న్యూఇయర్ ఈవెంట్ ను టార్గెట్‌గా డ్రగ్స్ డీలర్స్ పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ సప్లయ్ చేయటానికి ఎత్తు లేస్తున్నారు.. మరోవైపు థర్టీ ఫస్ట్ రాత్రి సంబరాల కోసం భారీగా ఆర్డర్ లభించిందని దాడుల్లో పట్టుబడ్డ గంజాయ్ అక్రమరవాణా చెబుతున్నారు.. థర్టీఫస్ట్ నైట్‌నే టార్గెట్ చేసుకొని చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ లోని పాల్మాకుల్ వద్ద సత్యనారాయణగార్డెన్‌లో 3 టన్నుల గంజాయి నిల్వచేశారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ అధికారులు మెరుపు దాడి చేసిగంజాయి స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ సందర్బంగా పబ్బులు, రెస్టారెంట్‌లు, బార్లు, హోటళ్లు, కాలేజీల్లో యువతి, యువకులే టార్గెట్‌గా గంజాయిని అమ్ముతున్న గ్యాంగ్ ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కింది.. వీళ్లలో ముఖ్య నిందితుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన హయత్ నగర్ పోలీస్‌లు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురి నిందితుల నుంచి రెండున్నర కిలోల నల్ల మందును స్వాధీనంచేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి కిలోల కొద్ది నల్లమందును దిగుమతి చేసుకొని, ఇక్కడి యువకులకు తులాల లెక్కలో అమ్ముతారని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఏడాదికి అటూ ఇటుగా 12వేల నుంచి 13వేల కిలోల గంజాయి సిటీలోకి డంప్ అవుతుంటే.. అందులో సగం.. అంటే దాదాపు ఆరువేల కిలోల గంజాయి ఖచ్చితంగా వినియోగం అవుతోంది. రేవ్ పార్టీలపై నిఘా పెరగడంతో.. నాలుగు గోడల మధ్యే దీన్ని తీసుకుంటున్నారు. బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రైళ్లలో, ప్రత్యేకంగా తయారుచేసిన డీసీఎంలలో గంజాయిని రవాణా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మంచి రకం గంజాయి కిలో 2 వేల నుంచి 5వేలకు అమ్ముతున్నారు. 200 గ్రాముల ప్యాకెట్లు 5వందలు పెడితే సిటీలో దొరుకుతున్నాయి. గతంలో నల్లమందు స్వాధీనమైనా.. ఇంత పెద్ద మొత్తంలో నల్లమందు దొరకటం ఇదే మొదటిసారంటున్నారు ఎక్సైజ్ అధికారులు.. కేవలం న్యూఇయర్ వేడుకల కోసమే ఇంత నల్లమందును దిగుమతి చేసుకున్నారనేది వాళ్ల వెర్షన్.. నిందితుల దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్స్ అధారంగా మత్తు మందు సరఫరా చేస్తున్న గ్యాంగ్‌ల ఆటకట్టిస్తామంటున్నారు పోలీస్ అధికారులు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్నేహితులు, బంధువులతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం సహజం. అయితే, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై సెలబ్రేషన్లు చేసుకుంటే, అడుసులో కాలు వేసి అగాధంలోకి దిగిన పరిస్థితే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









