'2.0' డబ్బింగ్‌లో బిజీగా ఉన్న సూపర్ స్టార్
- December 27, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తర్వాతి చిత్రం '2.0'కి డబ్బింగ్ చెబుతున్నారు. అకాడమీ అవార్డు విజేత సౌండ్ ఇంజనీరు రసూల్ పోకుట్టి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రజనీకాంత్ డబ్బింగ్ ప్రారంభించడం కోసం చెన్నై వెళ్తున్నానని తొలుత ట్వీట్ చేసిన ఆయన తర్వాతి ట్వీట్లలో రజనీని ప్రశంసలతో ముంచెత్తారు. పనిపట్ల తలైవాకున్న అంకితభావం సామాన్యమైనది కాదని, ఒక్కరోజులోనే మూడు రీళ్లు పూర్తి చేశారని, ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోయానని రసూల్ ట్వీట్ చేశారు.
'2.0' సీక్వెల్ కాదని, ఇది పూర్తిగా విభిన్నమైన చిత్రమని రసూల్ అన్నారు.
దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించగా, అమీజాక్సన్ కథానాయిగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







