ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది
- December 27, 2016
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని అంచనా. ఈ ప్రయోగానికి ఉపగ్రహ వాహన నౌక పీఎస్ఎల్‌వీ-37ను ఉపయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ బెంగళూరులో తెలిపారు. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. వీటి బరువు 500 కేజీలు. మూడు మాత్రం మన దేశ ఉపగ్రహాలు. ఇవి కార్టోశాట్ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్‌ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు.ఈ ఏడాది జూన్‌లో ఇస్రో రికార్డు సృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతకుముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది అయిదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో చైర్మన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







