1,600 మంది కార్మికులకు ఉద్వాసన..
- December 28, 2016
బంగ్లాదేశ్‌లోని 85 వస్త్ర తయారీ పరిశ్రమలు తమ సంస్థల్లో పనిచేస్తున్న 1,600 మంది కార్మికులను విధుల నుంచి తొలగించాయి. అక్రమంగా నిరసనల్లో పాల్గొన్నందుకు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేసి సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయేలా చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.4,560 నుంచి రూ.13,767కు పెంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో ఈ నెల ప్రారంభంలో పరిశ్రమలు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో అక్కడ పండగలకు దుస్తుల సరఫరా నిలిచిపోతుందేమోనని భయాందోళనలు నెలకొన్నాయి.
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమల కార్మికుల సంఘం మాత్రం 3,500కు పైగా కార్మికులను తొలగించారని తెలిపింది.
పోలీసుల అరెస్టులు, వేధింపులకు భయపడి ఎంతోమంది కార్మికులు దాక్కుంటున్నారని అక్కడ కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







